నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో కార్మికుల కృషి ప్రశంసనీయం: విజ‌య‌వాడ‌ మేయర్

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో కార్మికుల కృషి ప్రశంసనీయం: విజ‌య‌వాడ‌ మేయర్
  • ప్రభుత్వ పరంగా కార్మికులుగా గల సదుపాయాలపై సమగ్ర అవగాహన కలిగియుండాలి
విజ‌య‌వాడ‌: నగరపాలక సంస్థ పరిధిలో ఏపీసీఓఎస్ ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈఎస్ఐ కార్పొరేషన్ మరియు మెడికల్ ఇన్సురెన్స్ సేవల పట్ల  పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంగా గురువారం స్థానిక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ఉద్యానవన శాఖలో పని చేస్తున్న కార్మికులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి, ఈఎస్ఐ– ఏడీ వి.శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు సాదించుటలో, కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు మరియు విజయవాడ నగరం పరిశుభ్ర నగరంగా తిర్చుదిద్దుటలో కార్మికుల సేవలు మరియు కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఏపీసీఓఎస్ ద్వారా కార్మికులకు 1వ తేదిన జీతాలు ఇవ్వటం మరియు వారు చేస్తున్న పనికి తగిన వేతనము ఇవ్వటంలో కార్మికుల శ్రేయసే ప్రభుత్వ లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఏమైనా ఇబ్బందికర పరిస్ధితులు ఎదురైన సందర్భంలో ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా కార్మికులుగా మనకు ఉన్న బెనిఫిట్స్ పై ప్రతి కార్మికుడు అవగాహన కలిగియుండాలానే ఉదేశ్యంతో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయుట జరిగిందని అన్నారు. మనందరం ఒకే కుటుంబ సభ్యులం మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన నగరం పరిశుభ్రంగా ఉంటుంది, మీకు ఏమైనా అనారోగ్య పరిస్దితులు ఎదురైన, లేదా ఏదైనా ప్రమాదములు సంభవించిన అట్టి వారికీ ఆర్ధికంగా చేయూత నివాలనే సంకల్పంతో కమిషనర్ గారు మరియు పాలకులుగా మేము మీకు అన్ని రకాలుగా తోడు ఉంటామని భరోసా కల్పించారు.

ఈఎస్ఐ కార్పొరేషన్, కార్మిక రాజ్య భీమా సంస్థ పథకం, మెడికల్ ఇన్సురెన్స్ లపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి: కమిషనర్ పి.రంజిత్ భాషా:

ఈ సందర్భంలో కమిషనర్ పి.రంజిత్ భాషా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పనిచేస్తున్న అవుట్ సోర్స్ కార్మికులకు విధినిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించిన నగరపాలక సంస్థ తరుపున కొంత మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ వారు విధులు నిర్వహించు సమయంలో వారి జీతాల నుండి ఈఎస్ఐ, జీపీఎఫ్ వంటి ఖాతాలలో నగదు కడుతున్నారని, వాటి ద్వారా కూడా కార్మికులకు వర్తించు పథకములు మరియు బెనిఫిట్స్ వంటి అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించుట ద్వారా చదువుకోనని కార్మికులకు కూడా తెలుస్తుందని అన్నారు. ఇటివల నగరపాలక సంస్థ నందు పని చేస్తూ ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన కార్మికులకు నగరపాలక సంస్థ ద్వారా ఆర్ధిక సహాయం అందించుట జరిగిందని వివరించారు. గత కౌన్సిల్ నందు మరణించిన వారితో పాటుగా గాయాలు అయిన వారికీ తగిన విధంగా సహకారం అందించుటకు తీర్మానం ఆమోదించుకోవటం జరిగిందని అన్నారు. ఈఎస్ఐ, జీపీఎఫ్, మెడికల్ ఇన్సురెన్స్, సఫాయి కర్మచారి వంటి అనేక  భీమా పధకముల ద్వారా వచ్చు బెనిఫిట్స్ కూడా కార్మికులకు అందించుటకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని అన్నారు. ఇదే విధంగా నగరపాలక సంస్థ నందు పనిచేస్తున్నఏపీసీఓఎస్ కార్మికులందరికీ అవగహన కార్యక్రమాలు నిర్వహించుట జరుగుతుందని, మీరందరూ మీ మీ తోటి వారికీ కూడా వివరించి అందరిలో ఈ బెనిఫిట్స్ పై అవగాహన కల్పించాలని అన్నారు.

అదే విధంగా డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతాభాయి మాట్లాడగా కార్మికులకు వర్తించు సేవలు మరియు ఇతర బెనిఫిట్స్ పై ఈఎస్ఐ– ఏడీ వి.శ్యామ్ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెoటేషన్ ద్వారా సమగ్రంగా వివరిస్తూ, కార్మికులకు కల్గిన సందేహాలను నివృత్తి చేశారు.

కార్యక్రమములో ఉద్యానవన శాఖాదికారి శ్రీనివాసులు, ఈఎస్ఐ నుండి జీ.జగదీప్ గాంధీ, బి.ప్రసాద్, ఏపీసీఓఎస్- డీఈఓ మదన కుమార్, సుజిత్, పార్క్ సూపర్ వైజర్లు, ఉద్యాన వన శాఖా ఏపీసీఓఎస్ కార్మికులు పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News