ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలు.. కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందించిన విజయవాడ మేయర్

ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలు.. కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందించిన విజయవాడ మేయర్
  • కౌన్సిల్ తీర్మానం ప్రకారం వారి కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లింపు
విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న దేవర రామలక్ష్మి ది.01-11-2021 తేదిన నైట్ శానిటేషన్ నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుండి లారీ గుద్దడముతో ప్రమాదానికి గురై సంఘటన స్థలములోనే మరణించుట జరిగిన దర్మిలా డిసెంబర్ నందు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించుట జరిగిందని, వారి యొక్క ఆర్ధిక పరిస్థితులను దృష్ట్యా రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించుటకు కౌన్సిల్ వారు ఆమోదించిన దర్మిలా మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెక్కు శనివారం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 64వ డివిజన్ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మతో కలసి రామలక్ష్మి కుటుంబ సభ్యులు భర్త సన్యాసి అప్పడు మరియు కుమార్తె దేవర సౌజన్యలకు అందించుట జరిగింది.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News