ఎస్బీఐ బ్యాంక్ సేవలను ప్రారంభించిన తెలంగాణ సీఎస్!

ఎస్బీఐ బ్యాంక్ సేవలను ప్రారంభించిన తెలంగాణ సీఎస్!
  • బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఎస్బీఐ బ్యాంక్ సేవలు ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి

బూర్గుల రామకృష్ణా రావు భవన్ లోని ఉద్యోగుల సౌకర్యం కోసం ఎస్బీఐ బ్రాంచీని నేటి నుండి ప్రారంభిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సీఎస్ ఎస్బీఐ బ్రాంచీని లాంచనంగా ప్రారంభించారు. ఎస్బీఐ బ్రాంచీని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ బ్రాంచీలో సౌకర్యాలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, అధర్ సిన్హా, చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా, జనరల్ మేనేజర్ వి. రమేష్ , డీజీఎం రవీంద్ర గౌరవ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సికింద్రాబాద్ బ్రాంచ్) ఎస్. సంధ్య తదితరులు పాల్గొన్నారు. 

SKJoshi
Hyderabad
Telangana

More Press News