అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పర్చుకుందాం: విజయవాడ మేయర్

అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పర్చుకుందాం: విజయవాడ మేయర్
  • జాతీయ స్థాయిలో నగరాన్ని సుందరంగా  తీర్చిదిద్ది మెరుగైన ర్యాంక్ సాధించే దిశగా చర్యలు
  • నగరపాలక సంస్థ నందు ఘనంగా కార్పొరేటర్ల విజయోత్సవ వేడుకలు
విజయవాడ నగరపాలక సంస్థ - 2021 ఎన్నికలలో 49 డివిజన్లలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించి నేటికి ఏడాది కాలం పూర్తికాబడిన సందర్భంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు నగర మేయర్ అద్యక్షతన నిర్వహించిన విజయోత్సవ వేడుకలలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజారెడ్డి, వై.ఎస్.ఆర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు వై.ఎస్.ఆర్.సి.పి కార్పొరేటర్లతో కలసి కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడతూ అనేక సంక్షేమ పథకములు అమలు చేస్తూ, అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగనన్న పాలనయే విజయవాడ నగరంలో 49 మంది వై.ఎస్.ఆర్.సి.పి కార్పొరేటర్లు అధిక మెజారిటితో గెలవటం జరిగిందని, అంతటి ఘన విజయం సాధించి నేటికి సంవత్సర కాలం పూర్తియినదని అన్నారు. మా యొక్క విజయానికి వారధిగా ఉంటూ ప్రత్యేక్షంగా మరియు పరోక్షంగా కృషి చేసిన దేవాదాయ శాఖామాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యలు మల్లాది విష్ణువర్ధన్, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

విజయవాడ నగరాని అభివృద్ధి పథంలో నిడిపించుటకు ఎల్లవేళలా వారి సహకారం ఉంటుందని, రాబోవు రోజులలో కూడా అధికారులు మరియు ప్రజాప్రతినిధుల అందరి సమిష్టి సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని జాతీయ స్థాయిలో విజయవాడ నగరాన్ని సుందరంగా  తీర్చిదిదిద్దుతమని, గతంలో వచ్చిన ర్యాంక్ కంటే మెరుగైన స్థానంలో నిల్పేందుకు కృషి చేస్తామని అన్నారు.

తదుపతి డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజారెడ్డి, వై.ఎస్.ఆర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు వై.ఎస్.ఆర్.సి.పి కార్పొరేటర్లు ప్రసంగించారు. కార్యక్రమములో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News