దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నా: ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్

దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నా: ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరి చందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారి దర్శనార్ధం తిరుమల చేరుకున్న ఆయన తొలుత పద్మావతి అతిధి గృహానికి విచ్చేశారు. అనంతరం గౌరవ గవర్నర్ హరి చందన్ మహాద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్ర గవర్నర్ కు రంగ నాయక మండపం లో అర్చక స్వాములు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి ఆశీర్వచనం అందించారు.

ఆలయ ఆవరణ లో గవర్నర్ పాత్రికేయుల తో మాట్లాడుతూ భారత దేశం గొప్ప  ప్రజాస్వామ్య దేశమని, భారత దేశం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నా నన్నారు. శ్రీవారి దర్శనానంతరం గవర్నర్ శ్రీ పద్మావతి అతిధి గృహానికి చేరుకొని గురువారం సాయంత్రం తిరుమల నుండి రేణిగుంటకు బయలు దేరి వెళ్ళారు. ఈ కార్యక్రమం లో  టీ.టీ.డీ.చైర్మన్  వై.వీ.సుబ్బా రెడ్డి, ఈ.ఓ.అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈ.ఓ.ధర్మా రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. 
Andhra Pradesh
Tirumala
Tirupati
bishwabhushan

More Press News