మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ఐటీ రంగానికి తీరని లోటు: విజ‌య‌వాడ‌ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ఐటీ రంగానికి  తీరని లోటు: విజ‌య‌వాడ‌ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజ‌య‌వాడ‌: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె ఛాంబర్ నందు గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ తుదిశ్వాస వరకు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి విశేష కృషి చేసిన పిన్న వయస్కుడైన గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవటం భాదాకరం అన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఎనలేని మక్కువ చూపించి, ఎంతో ఆప్యాయంగా ఉండే మంచి మనిషి దూరం కావటం జీర్ణించుకోలేక పోవుచున్నానని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
VMC
Mekapati Goutham Reddy
Vijayawada
Andhra Pradesh

More Press News