ఓవర్సీస్ స్కాలర్ షిప్పుల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి, పరిష్కరించండి: మంత్రి కొప్పుల ఈశ్వర్

Related image

హైదరాబాద్: ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతికి అమలవుతున్న పథకాలపై సోమవారం మంత్రి కొప్పుల సమీక్ష జరిపారు. మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, కమిషనర్ యోగితారాణా, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

మంత్రి కామెంట్స్:

  • అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారు
  • ఈ పథకం ద్వారా విదేశాలలో విద్యనభ్యసించాలనే ఆసక్తి కలిగిన యువతకు 20లక్షల రూపాయలు ఉచితంగా అందజేస్తున్నాం
  • ఇందుకోసం దరఖాస్తులను మానవతా దృక్పథంతో  పరిశీలించాలని, అవసరమయితే నిబంధల్ని సడలించి సహాయం చేయాలి
  • ప్రజా ప్రతినిధిగా తాను ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూశాను
  • సంక్షేమ వసతి గృహాలలో సదుపాయాలు మరింత మెరుగు పర్చాలి
  • ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న హాస్టళ్లలో సౌరశక్తిని ఉపయోగించి వాటర్ హీటర్లు, కోల్డ్ స్టోరేజ్ లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలి
  • వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులయ్యే వారికి రాష్ట్రంలో 12 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి
  • అన్ని జిల్లా కేంద్రాలలో స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

More Press Releases