ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

Related image

  • రూ. 257. 83 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
  • ప్రణాళికాబద్ధకంగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తాం: కమిషనర్ పి.రంజిత్ భాషా
విజ‌య‌వాడ‌: సెంట్రల్ నియోజక వర్గ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం మరియు భూమి పూజ కార్యక్రమములో శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ మరియు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. 59వ డివిజన్ నందు రూ. 38.58 లక్షల అంచనాలతో గుజ్జల సరళాదేవి కళ్యాణమండప మరమ్మతుల పనులకు, రూ.9.60 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మొహమ్మద్ షహీనా సుల్తానాతో కలసి శంకుస్థాపన చేశారు.

అదే విధంగా 58వ డివిజన్ రూ.9.14 లక్షలతో నందమూరి నగర్ నందు సిసి డ్రెయిన్ నిర్మాణ పనులకు, రూ.106.29 లక్షల అంచనాలతో బి.టి హాట్ మిక్స్ రోడ్ పనులకు, 82.47 లక్షల వ్యయంతో పలు అంతర్గత రోడ్లను బి.టి రోడ్ గా అభివృద్ధి పరచుటకు మరియు రూ.11.65 లక్షలతో ఆర్ అండ్ బి లేఔట్ మెరక చేయు పనులకు స్థానిక కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గ వర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గం అభివృద్ధి పరచేలా వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు. నేడు సుమారుగా 2.5 కోట్ల అంచనాలతో 16 రోడ్లు మరియు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా సరళాదేవి కళ్యాణమండపం అభివృద్దికి శ్రీకారం చుట్టినట్లు వివరిస్తూ, ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవసరమైన మౌలిక వసతులు కల్పించుటయే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అలసత్వం వహించకుండ చేపట్టిన అన్ని పనులు పూర్తి చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుట జరుగుతుందని, రాబోవు రోజులలో కమిషనర్ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి  పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సెంట్రల్ నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా గుజ్జల సరళాదేవి కళ్యాణమండపం తీర్చిదిద్దాలనే శాసనసభ్యుల కోరిక మేరకు స్టాండింగ్ కమిటి నందు ఆమోదించుకొని మర్మమతులు చేపట్టుట జరిగిందని వివరిస్తూ, నియోజకవర్గకై శాసనసభ్యుల కృషి ప్రసంశించారు.

కమిషనర్ రంజిత్ భాషా మాట్లాడుతూ ప్రాదాన్యత క్రమంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, చేపట్టిన అన్ని నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ సందర్భంలో స్థానిక కార్పొరేటర్లు తెలిపిన సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోని అన్నింటిని పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

పై కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఇతర అధికారులు సిబ్బంది, వైసిపి నాయుకులు రహుల్లా మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

More Press Releases