ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం: మంత్రి బొత్స

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం: మంత్రి బొత్స
  • ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
  • రూ.785.50 లక్షల రూపాయల అంచన చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభ మరియు శంకుస్థాపనలు
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభ మరియు శంకుస్థాపన కార్యక్రమములలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు పలువురు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ముందుగా 34వ డివిజన్ పరిధిలోని మీసాల రాజేశ్వరరావు వంతెన నుండి ఎర్రకట్ట వరకు రూ.80 లక్షలతో వ్యయంతో అభివృద్ధి పరచిన సి.సి.రోడ్, కేదారేశ్వర పేట ఎర్రకట్ట డౌన్ నందు  రూ.35.50 వ్యయంతో 0.41 ఎకరాలలో పాత్ వే, సీటింగ్ ప్లాజా, పిల్లల అట పరికరాలు, షటిల్ కోర్ట్, గ్రీనరి తో అభివృద్ధి పరచిన పార్క్ ను ప్రారంభించారు. తదుపరి 56వ డివిజన్ లో కంసాలి పేట, పాత రాజరాజేశ్వరీ పేట వాసులకు త్రాగునీటి సరఫరాకై రూ.320.00 లక్షల 14వ ఆర్ధిక నిధులతో నూతనంగా నిర్మించనున్న 1500 కె.ఎల్ రిజర్వాయర్ నిర్మాణము మరియు 48, 49, 50 & 51 వ డివిజన్ల పరిధిలో గల చిట్టినగర్ జంక్షన్ నుండి నెహ్రు బొమ్మ సెంటర్ వరకు రూ. 350.00 లక్షల 14వ ఆర్ధిక నిధులతో సి.సి పేవ్‌మెంట్, ఫుట్‌పాత్ మరియు సి.సి రోడ్ నిర్మాణ పనులకు మున్సిపల్ మంత్రి శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్కూల్ లో ఏర్పాటు చేసిన RO మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించుటయే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ప్రజలకు యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంత మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు స్థానిక కార్పొరేటర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధకంగా నగర అభివృద్ధికి శ్రీకారం చుట్టుతుందని అన్నారు. అదే విధంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ గారి పుట్టిన రోజును పురష్కరించుకొని పశ్చిమ నియోజికవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను మున్సిపల్ మంత్రి గారి చేతుల మీదగా ప్రారంభించుట జరిగిందని, రాజరాజేశ్వరీ పేట ప్రాంత వాసులకు రెండు పూటల మంచినీటి అందించుటకు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయుట జరిగిందని, దీనిని రాబోవు 8 నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు.

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్లు బండి పుణ్యశీల, యలకల చలపతిరావు, మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి, బుల్లా విజయ కుమార్, బోయి సత్యబాబులతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఇతర కార్పోరేషన్ల చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
VMC
Botsa
Vellampalli Srinivasa Rao
Vijayawada
Andhra Pradesh

More Press News