టీ-శాట్ ఆవరణలో మొక్కలు నాటిన తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ

Related image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీ-శాట్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఎస్.కె.జోషీ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీ-శాట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. టీ-శాట్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన జోషీ తొలుత టీ-శాట్ సీఈవో కార్యాలయంలో సీఈవో ఆర్.శైలేష్ రెడ్డితో టీ-శాట్ నిర్వహణ గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జోషీ మాట్లాడుతూ టీ-శాట్ భవనం చుట్టూ ఆహ్లాదకర వాతావరం ఉందని అందుకు అనుగుణంగా విరివిగా చెట్లు పెంచాలని సూచించారు. నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. సీఎస్ వెంట డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ముగిసాక జోషీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టీ-శాట్ కార్యాలయ ఆవరణలో ఉన్న వి.హబ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

More Press Releases