మీడియా మిత్రులకు నమస్కారం: పవన్ కల్యాణ్

మీడియా మిత్రులకు నమస్కారం: పవన్ కల్యాణ్

'విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సంపూర్ణ మద్దతును తెలియచేస్తున్నాను. అయితే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడంవల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ  వైద్యం పై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్ళీ  బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో  పాల్గొనడం లేదు. అయితే జనసేన తరఫునుంచి పార్టీ ప్రతినిధులు మీరు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం విజయవంతం కావాలని' ఆకాంక్షిస్తూన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh

More Press News