పారిశుధ్య నిర్వహణ, పార్క్ ల సుందరీకరణ అంశాలపై వీఎంసీ కమిషనర్ సమీక్షా

పారిశుధ్య నిర్వహణ, పార్క్ ల సుందరీకరణ అంశాలపై వీఎంసీ కమిషనర్ సమీక్షా
  • అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ: నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మంగళవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు అధికారులతో సమవేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును మెరుగుపరచుటలో భాగంగా చేపట్టివలసిన చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమములో భాగంగా నివాసాల నుండి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ విధానము వంద శాతం జరిగేలా చూడాలని, యూజర్ చార్జీల వసూళ్ళపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన మరియు చేపట్టవలసిన అభివృది పనుల యొక్క పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని, చేపట్టిన అన్ని నిర్మాణ పనులు నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. అదే విధంగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంగా నగరంలో చేపట్టిన వివిధ పార్క్ ల ఆధునీకరణ పనులు కూడా వేగవంతము చేసి పార్క్ లను సందర్శకులకు అందుబాటులోనికి తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News