సీవీఆర్ స్కూల్ నందలి అభివృద్ధి ఆధునికీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

సీవీఆర్ స్కూల్ నందలి అభివృద్ధి ఆధునికీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజ‌య‌వాడ‌: గవర్నర్ పేట సీవీఆర్ నగరపాలక సంస్థ హైస్కూల్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టాయిలెట్స్ పనులు సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. ఇంకను ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నచో వాటిని కూడా చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో ఎక్కడైనా చెత్త మరియు పనికిరాని సామాగ్రి ఉన్నచో వాటిని తొలగించి అన్ని తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 14వ ఆర్ధిక సంఘ నిధులతో చేపట్టిన స్కూల్ బిల్డింగ్ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఆదేశించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.వి.రామకోటేశ్వర రావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News