సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయవాడ మేయర్

సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయవాడ మేయర్
విజయవాడ: స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో విజయవాడ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో మూడవ ఉత్తమ పరిశుభ్ర నగరంగా, చెత్త రహిత నగరంగా 5 స్టార్‌ రేటింగ్, వాటర్ ప్లస్ సిటీ, PrerakDauur Samman Award - Gold (Anupam)లను సాదించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించుట జరిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని గురువారం రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, కమిషనర్ మరియు సంచాలకులు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ యం.యం నాయక్ లతో కలసి విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మర్యాద పుర్వకంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహనరెడ్డిని మరియు మునిసిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణని కలసి అవార్డులను సాధించుటకు ఆయా రంగములలో నగరపాలక సంస్థ చేపట్టిన సంస్కరణలకు అందించిన సహకారములకు కృతజ్ఞతలు తెలిపారు.
Vijayawada
VMC
Jagan

More Press News