దసరా ఉత్సవాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రి వెల్లంపల్లి!

Related image

  • ఈనెల 29నుండి ఇంద్ర కీలాద్రి దసరా ఉత్సవాలు
  • ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసిన మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  •  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు

ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్ర కీలాద్రి దసరా ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రావలసిందిగా మంత్రి శ్రీనివాసరావు ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లి నివాసంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ ఈవో సురేష్ కుమార్, ఆలయ వేదపండితులతో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలలో అమ్మవారికి జరిగే ప్రత్యేక సేవలను సీఎంకు మంత్రి వివరించారు. దసరా ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

More Press Releases