ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలి: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Related image

  • ప్యానల్ లిస్టు ఆమోదం తెలిపిన ప్యానల్ కమిటి
విజయవాడ నగరపాలక సంస్థలోని 4 ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయు విషయమై శుక్రవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అద్యక్షత ఆమె ఛాంబర్ నందు ప్యానల్ కమిటి సమావేశం జరిగింది. విద్యా శాఖా రూపోందించిన ఈ ప్యానల్ లిస్టును ఆమోదంచుటకై విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా విద్యాశాఖాధికారి తహేరా సుల్తానా సభ్యులుగా ఉన్నారు.

ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయు నిమిత్తం మరియు ప్యానల్ సంవత్సరము ఆగస్టు 2022 నాటికీ సదరు ఖాళి అయ్యే 2 పోస్ట్ లను ఎప్పటికప్పుడు పదోన్నతి కలించుటకై మొత్తం 6 (ఆరు) పోస్ట్ లను ప్యానల్ ఇయర్ లో భర్తీ చేయుటకు 1:3 నిష్పత్తిలో మొత్తం 18 మంది సీనియారీటి లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ తో ప్యానల్ తాయారు చేయడం జరిగింది. సదరు ప్యానల్ లిస్టును సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. రేపు అనగా 06-11-2021 వ తేదిన లిస్టు ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి అర్హులైన వారికీ పదోన్నతి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు.

తదుపరి 59 ULB ల యందు అత్యధిక రోలు కలిగిన ప్రశాంతి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఝాన్సీలక్ష్మిబాయిని మేయర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి ఘనంగా సన్మానించారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి తహేరా సుల్తానా, నగరపాలక సంస్థ ఉపవిద్యాశాఖాధికారి ఇన్ ఛార్జ్ కె.వి.వి.ఆర్ రాజు, స్కూల్స్ సూపర్ వైజర్లు షేక్ సైదా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases