నగరాభివృద్ధియే లక్ష్యంగా వైసీపీ పాలన: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

నగరాభివృద్ధియే లక్ష్యంగా వైసీపీ పాలన: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
  • 3వ డివిజన్ లో రూ.19.85 లక్షలతో  నిర్మించిన కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు ప్రారంభం
విజయవాడ: కరెన్సీ నగర్ 3వ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్ మొదటి అంతస్తు ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళికతో కలసి మేయర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రూ.19.85 లక్షల నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్ తో కమ్యూనిటి హాల్ మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు. నగర అభివృద్ధిలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి అనేక కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, నిర్దేశించిన గడువు ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రాంత వాసులు చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సచివాలయ సిబ్బంది కూడా ఏదైనా సమావేశాలు నిర్వహించుకొనుటకు కూడా అనువుగా ఉంటుందని అన్నారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధతో సమస్యలను పరిష్కరించుటలో కృషి చేస్తున్న దేవినేని అవినాష్ కి  అభినందనలు తెలియజేశారు.

అదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ నందలి 14వ వార్డ్ సచివాలయాన్ని సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది యొక్క పని విధానము, అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వo ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరువ చేయాలని, పథకముల యొక్క పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.

కార్యక్రమములో కో-ఆప్టెడ్ స‌భ్యులు ముసునూరి సుబ్బారావు, నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది మరియు స్థానిక వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్:

నగర ప్రజలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోని హరిత (green) బాణసంచా కాల్చుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని సూచించారు. టపాసులు కాల్చుకొనే సమయంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్ కు దూరంగా ఉంటు ఏ విధమైన ప్రమాదాలు జరుగకుండా ఆనందంగా సంతోషకరంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News