ఐఏఎస్ ఆఫీసర్లకు ఐ ఫోన్లను బహుకరించిన తెలంగాణ సీఎస్!

ఐఏఎస్ ఆఫీసర్లకు ఐ ఫోన్లను బహుకరించిన తెలంగాణ సీఎస్!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. సోమవారం సచివాలయంలో 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఆపిల్ మ్యాక్ బుక్, ఐ ఫోన్, ఐ ప్యాడ్ లను సీఎస్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా, డిప్యూటి సెక్రటరి చిట్టిరాణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రోజువారి కార్యకలాపాల నిర్వహణలో సాంకేతికతను వినియోగించుకోవాలని, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. గ్రామాలలో అమలవుతున్న 30 రోజుల ప్రణాళిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం పట్ల విస్తృతమైన అవగాహనను కల్పించుకోవాలని అన్నారు. 

Chief Secretary
SK Joshi
Hyderabad
i-phone
i-pads
IAS Officers

More Press News