సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన వీఎంసీ క‌మిష‌న‌ర్

Related image

విజ‌య‌వాడ‌: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించుటతో పాటుగా పథకములకు సంబందించిన పూర్తి వివరాలు విధిగా సచివలయాలలోని డిస్ ప్లే బోర్డు నందు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.

శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి రాణిగారితోట సిమెంట్ గౌడౌన్ వద్ద గల 82, 83, 84 మరియు సూర్యారావుపేటలోని 91, 92 వార్డ్ సచివాలయాలను తనిఖి చేశారు. సచివాలయం సిబ్బంది యొక్క పని తీరును మరియు వారి వద్ద గల పలు రిజిస్టర్ లను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకములపై ప్రజలకు పూర్తి అవగాహన కలిపించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. దీనికి సచివాలయం నందలి డిస్ ప్లే బోర్డు నందు పథకముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రాణిగారితోట నందలి అంగన్ వాడి స్కూల్ ను పరిశీలిస్తూ, అక్కడ విధిగా ప్రతి ఒక్కరు కోవిడ్ నిభందనలు పాటిస్తూ, స్కూల్ ఆవరణ అంతయు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

పర్యటనలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

దసరా ఉత్సవాలలో పారిశుధ్య నిర్వహణ పరిశీలన:

దసరా ఉత్సవాలకు సంబందించి పారిశుధ్య పనులు నిర్వహించు 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్లు మరియు ఆలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు, క్యూ లైన్ లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సిబ్బందికి సకాలంలో భోజన ప్యాకెట్ లు అందుతున్నది లేనిది సిబ్బందిని అడిగితెలుసుకొన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ లు మరియు శానిటేషన్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అదే విధంగా మంచి పాయింట్ లను పరిశీలించి నిరంతరం ప్రజలకు త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

More Press Releases