తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిరంతరం అందుబాటులో ఉంచాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • దసరా ఏర్పాట్లు పరిశీలన, అధికారులకు పలు ఆదేశాలు
విజయవాడ:దసరా ఉత్సవాలను పురస్కరించుకొని నగరపాలక సంస్థ ద్వారా కల్పించిన వసతులను నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగుకుండా చూడాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్, రాజీవ్ గాంధీ పార్క్, పుష్కర ఘాట్, సీతమ్మ వారి పాదాలు, రధం సెంటర్, దుర్గ ఘాట్, పున్నమి ఘాట్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంచిన వసతులను క్షేత్రస్థాయిలో పరిశిలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా దేవి నవరాత్రులకు వచ్చు భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగుకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఘాట్ల యందు మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితులను నెలకొల్పి ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

నగరంలోని అన్ని ప్రధాన రహదారులతో పాటుగా ఘాట్లకు వెళ్ళు రహదారులు, క్యూలైన్స్ నందు ఎటువంటి చెత్త మరియు వ్యర్ధములు కనపడకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మరియు భక్తులకు అందుబాటులో గల మురుగు దొడ్లు మరియు త్రాగునీటి పాయింట్ లను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

యాత్రికులకు అందుబాటులో ఉంచిన తాత్కాలిక మరుగుదొడ్లు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచి 24గంటలు వాడుకపు మరియు సిబ్బందిని అందుబాటులో ఉండునట్లుగా చూడాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు.

అదే విధంగా క్యూ లైన్ లలో అందుబాటులో గల చెప్పుల స్టాండ్, సామాన్లు భద్రపరచుకోను క్లోక్ రూమ్ మరియు మెడికల్ క్యాంప్ లను పరిశీలించి అక్కడ విధినిర్వహణలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొని విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నియమాలు పాటిస్తూ, ప్రజలను కుడా అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

అనంతరం రాజీవ్ గాంధీ నందు జరుగుతున్న అభివృద్ధి పనుల యొక్క పురోగతిని పర్యవేక్షిస్తూ, పనులు వేగవంతముగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పార్క్ నందు ఖాళీగా ఉన్న షాపు లలో డ్వాక్వా బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనుటతో పాటుగా షాపింగ్ బజార్ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని అన్నారు. అదే విధంగా పార్క్ ఆవరణలో గల పనికిరాని స్క్రాబ్ ఆక్షన్ వేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పర్యటనలో చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి, ఎస్టేట్ ఆఫీసర్ డా.ఎ.శ్రీధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, హెల్త్ ఆఫీసర్లు డా.ఇక్బాల్ హుస్సేన్, డా.సురేష్ బాబు, డా.రామకోటేశ్వరరావు, డా.శ్రీదేవి, శానిటరీ ఇన్స్ పెక్టర్లు ఇతర సిబ్బంది ఉన్నారు.

More Press Releases