గాంధీ కొండపై చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్

గాంధీ కొండపై చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్
విజ‌య‌వాడ‌: వన్ టౌన్ గాంధీజీ పర్వతంపై నగరపాలక సంస్థ ద్వారా చేపట్టవలసిన ఆధునికీకరణ పనుల విషయమై కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం అధికారులతో కలసి పరిశీలించారు. గాంధీ జయంతిని పురష్కారించుకొని అక్టోబర్ 2వ తేదిన చిల్ద్రెన్ పార్క్ ప్రారంభించనున్నందున గాంధీ హిల్ పై చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొండపై ప్రాంతములో పిల్లలకు ఏర్పాటు చేయనున్న ఆట పరికరాలు, లైట్ ల ఏర్పాటు, ఆడిటోరియం ఆధునికీకరణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News