పూణెలో వీఎంసీ బృందం ప‌ర్య‌ట‌న

పూణెలో వీఎంసీ బృందం ప‌ర్య‌ట‌న
  • ఆధునిక టెక్నాలజీ వాహనాల పరిశీలన
విజయవాడ: అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అభివృద్ది చ‌ర్య‌ల్లో భాగంగా నగరపాలక సంస్థ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వ‌ర్యంలో కార్పొరేటర్లు బొల్లా విజయకుమార్, బి.ఎస్.వి జానారెడ్డి, సి.హెచ్ రామమోహన రావు, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు లతో కూడిన బృంద సభ్యులు రెండు రోజుల పాటు పూణె నగరంలో పర్యటించనున్నారు.

న‌గ‌రంలో KAM-AVIDA ENVIRO ENGINEERS PVT. LTD వారి ఆహ్వ‌నం మేర‌కు వీఎంసీ బృందం సోమవారం పూణెలో కంపెనీలోని ఆధునిక టెక్నాలజీ వాహనాల ప‌నితీరును అధ్య‌య‌నం చేశారు. యు.జి.డి డ్రెయిన్లు శుభ్రపరచుటకు అత్యాధునిక టెక్నాలజీతో కలిగిన వాహనముల పని తీరు, ఆపరేట్ చేయు విధానము మొదలగు అంశాలను బృందం స‌భ్యులు పరిశీంచారు. 7వ తేదీ పూణెలో వీఎంసీ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. 
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News