కారుణ్య నియామకం ద్వారా ఐదుగురికి పోస్టింగ్: విజయవాడ మేయర్

కారుణ్య నియామకం ద్వారా ఐదుగురికి పోస్టింగ్: విజయవాడ మేయర్
  • విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
విజయవాడ: నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన వారి యొక్క  కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు నగర మేయర్ భాగ్యలక్ష్మి  తన ఛాంబర్ నందు అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణతో కలసి 5 గురికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను స్వయముగా అందజేశారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు అధికారులు మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, వాచ్ మ్యాన్, స్వీపెర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని మీరందరు అందరూ విధి నిర్వహణలో బాధ్యతయుతముగా విధులు నిర్వహించాలని అన్నారు. 
vmc
Vijayawada
Andhra Pradesh

More Press News