ఈనెల 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్!

ఈనెల 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్!
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈనెల 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్' పేరుతో భారీ డిస్కౌంట్ లతో అమ్మకాలకు తెరతీసింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ లు, టీవీలు, గృహోపకరణాలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ లభించనుంది. వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్నట్లయితే సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12గంటల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. కాగా అక్టోబర్ 4 అర్ధరాత్రి 12 గంటలకు ఈ సేల్ ముగియనుంది.
amazon
great indian sale
dasara festival
Hyderabad

More Press News