క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌

Related image

  • మొద‌టి డోస్‌గా 6 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్
  • అంద‌రికీ సంక్షేమం, అభివృద్ది వైసీపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం
  • న‌గ‌రంలో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం ప్రారంభం
విజ‌య‌వాడ‌: అర్హ‌త ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి  సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో వైసీపీ ప్ర‌భుత్వం పని చేస్తుంద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శ‌క్ర‌వారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 37వ డివిజ‌న్ లో ఎమ్మెల్సీ మహమద్ కరిమునిస్సా, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్  ప్ర‌స‌న్న వెంక‌టేష్, జాయింట్ క‌లెక్ట‌ర్ శివ‌శంక‌ర్‌ లతో క‌ల‌సి సిటిజన్‌ అవుట్‌ రీచ్ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించిన మంత్రి స్థానికుల‌ను, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై వారి అభిప్రాయ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

అర్హ‌లైన ప్రతి  ఒక్క‌రికి సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ల‌క్ష్యంతో సిటిజన్‌ అవుట్‌ రీచ్ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. అందులో భాగంగా  ప్ర‌తి నెల ఆఖ‌రి శుక్ర‌వారం, శ‌నివారాలలో వార్డు వాలంట‌రీల‌తో పాటు అడ్మిన్ కూడా డివిజ‌న్ ప‌ర్య‌టించి, అర్హ‌త ఉండి వివిధ కార‌ణాల‌తో సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని వారిని గుర్తించి వారికి సంక్షేమ ప‌థ‌కాల‌ను చేరువ చేయాల‌నే సిటిజ‌న్ జౌట్ రిచ్ ప్రాగాం రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. జిల్లా యంత్రంగంతో క‌లిసి న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్న‌ట్లు వివ‌రించారు.స‌చివాల‌య‌ల్లో అందుతున్న 543 సేవ‌లు ప్ర‌జ‌లు చేరువ చేయాల‌నే, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న‌ జ‌గ‌న‌న్న సంక‌ల్పం అన్నారు. ప్ర‌జ‌లు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న విధానంపై అనందంగా ఉన్నారన్నారు. అదే విధంగా ఈ ప్రాంతంలో వారికి ఇళ్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టితే. నారా చంద్ర‌బాబు నాయుడు పేద‌ల‌కు అమ‌రావ‌తిలో ఇళ్లు ఇవ్వ‌డానికి అగిక‌రీంచ‌క‌ కోర్టులో కేసులు వేయించ‌డం జ‌రిగింద‌ని, త‌ర్వ‌లోనే కోర్టు తీర్పు అనంత‌రం పేద‌లు ఇళ్లు, ఇండ్లు ప‌ట్టాల పంపిణి జ‌రుగుతుంద‌న్నారు.

క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌:

 
క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని రాష్ట్ర ప్ర‌భుత్వం తగిన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని, అందులో భాగంగా నగరంలో 18   సంవ‌త్స‌రాలు పైబ‌డి అంద‌రికి రెండు రోజుల పాటు మెగా వాక్సిన్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. మొద‌టి డోస్‌గా 6,48,562 మందికి, మొదటి మరియు రెండోవ డోస్ టీకా కలిపి  నేటికి 8,61,237 మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప‌శ్చిమ  నియోజ‌క‌వ‌ర్గంలో 37వ‌ డివిజ‌న్‌లో ర‌జ‌క పాఠ‌శాల ఉన్న స‌చివాలయంలో వాక్సిన్ ప్రక్రియను మంత్రి ప‌రిశీలించారు. న‌గ‌రంలో 286 వార్డు స‌చివాల‌యంలో రెండు రోజ‌లు పాటు అన్ని కేటగిరీల వారికి  టీకాలు వేయడం జరుగుతుంద‌న్నారు. అంద‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌రిమునిస్సా, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ శివ‌శంక‌ర్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్  ప్ర‌స‌న్న వెంక‌టేష్, ఇతర అధికారులు ఉన్నారు.

More Press Releases