స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకై చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకై చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు వచ్చు అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో పాటుగా మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొల్పలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి ఇందిరాగాంధీ అవుట్ డోర్ స్టేడియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి చేపట్టవలసిన అంశాలపై అధికారులతో చర్చించి స్టేడియంలో గ్రౌండ్ లెవెలింగ్ చేసి రోలింగ్ చేయాలని, అతిధులు వచ్చు మార్గం లెవెల్స్ చేసి ఎంట్రన్స్ పెయింటింగ్ నిర్వహించాలని, అవసరమైన ప్రదేశాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. స్టేడియం ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు అన్ని కూడా శుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా స్టేడియంలో నిలిచిన వర్షపు నీటిని హై టేక్ మిషన్ ద్వారా తోడించి అవసరమైనచో గ్రావెల్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.చంద్ర శేకర్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాత్రుడు మరియు పొలిసు, ఇతర విభాగాములకు సంబంధించిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Vijayawada
VMC
Andhra Pradesh

More Press News