జ్యోతి సురేఖ ధైర్య సాహసాలు అభినందనీయం: ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

జ్యోతి సురేఖ ధైర్య సాహసాలు అభినందనీయం: ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
జ్యోతి సురేఖ పిన్న వయస్సులోనే విలువిద్య క్రీడలో అనితర సాధ్యమైన విజయాలను అందుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. సురేఖ సాధించిన విజయాలు చిన్నవికావని దేశం మొత్తం గర్విస్తుందని గవర్నర్ తెలిపారు. విలువిద్య ఛాపింయన్, అర్జున అవార్డు గ్రహీత వెన్నమ్ జ్యోతి సురేఖను రాజ్ భవన్ వేదికగా శనివారం గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. 4 సంవత్సరాల 11 నెలల వయస్సులోనే కృష్ణ నదిలో 5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టిన సురేఖ అతి పిన్న వయస్సు స్విమ్మర్ గా ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నారన్నారు.

అత్యంత  ధైర్యసాహసాహలతో కూడుకున్న ఈ రికార్డు సాధించిన జ్యోతి సురేఖ అభినందనీయిరాలని గవర్నర్ పేర్కొన్నారు. నెదర్లాండ్ లో జరిగిన 50వ ప్రపంచ విలువిద్య ఛాంపియన్‌షిప్ 2019 లో కాంస్య పతకం సాధించిన నేపధ్యంలో జ్యోతి సురేఖాను గవర్నర్ హరిచందన్ రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలను అందుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Jyothi Surekha
Governor
Harichandan
Andhra Pradesh

More Press News