విజయవాడ మేయర్ అధ్యక్షతన స్థాయి సంఘ సాధారణ సమావేశం

విజయవాడ మేయర్ అధ్యక్షతన స్థాయి సంఘ సాధారణ సమావేశం
విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగింది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి తదితరులు సమావేశంలో ఉన్నారు.

సదరు సమావేశంలో 20 అంశాలపై చర్చించి 10 అంశాలను ఆమోదిస్తూ, 3 అంశాలు వాయిదా, 3 అంశాలను పూర్తి సమాచారంతో తదుపరి సమావేశంలో ఉంచాలని తీర్మనిస్తూ, పరిపాలన పరమైన అంశాలకు సంబందించి 1 అంశమును ధ్రువీకరించుట మరియు 2 అంశాలను ర్యాటి చేయుటం జరిగింది.
Vijayawada

Watch Today's Deals on Amazon

More Press News