చేనేత జౌళి శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అర్జున రావు

చేనేత జౌళి శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అర్జున రావు
విజయవాడ: చేనేత జౌళి శాఖ సంచాలకులుగా 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారి పడాల అర్జున రావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని చేనేత జౌళి శాఖ కమీషనరేట్ లో చార్జి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న బీఆర్ అంబేద్కర్ శ్రీకాకుళం జేసీగా బదిలీ అయ్యారు.

సమైఖ్య రాష్ట్రంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా పని చేసిన అర్జున రావు, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సందర్భంలో ఇక్కడికి బదిలీ అయ్యారు. నూతనంగా రాజ్ భవన్ ఏర్పాటు, గవర్నర్ ప్రమాణ స్వీకారం వంటి రాజ్యాంగ బద్దమైన విషయాలలో కీలకంగా వ్యవహరించిన పడాల సుమారు సంవత్సరం పాటు ఇక్కడ సేవలు అందించారు.

అనంతరం దేవాదాయ శాఖ కమీషనర్ గా బదిలీ అయిన అర్జునరావు తనదైన శైలిలో ఆ శాఖలో సంస్కరణలకు బీజం వేశారు. తాజాగా శుక్రవారం జరిగిన బదిలీలలో భాగంగా చేనేత జౌళి శాఖ సంచాలకులుగా నియమితులు కాగా, శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో ప్రాథమికంగా సమావేశం అయ్యారు.

శాఖ పని తీరుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధాన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆ క్రమంలో అధికారులు మెరుగైన పని తీరును ప్రదర్శించాలని ఆదేశించారు.
Vijayawada
Andhra Pradesh

More Press News