గోదావరి నది పరివాహక ప్రాంతాలలో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్

Related image

ములుగు: వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో గోదావరి నది పరివాహక ప్రాంతాలు మంగంపేట, రామన్నగూడెంలలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంతు జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, చీఫ్ ఇంజినీర్ విజయ్ భాస్కర్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు.

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:

  • గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు పడడం వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు ఉదృతంగా వస్తున్నాయి
  • గోదావరి ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ పని చేయక పోవడం వల్ల ఆలస్యం అయింది అయితే సీఎం కేసీఆర్  గారు కాంట్రాక్టర్ ను మార్చి మళ్ళీ 137 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్  గారి కి ధన్యవాదాలు
  • నీటి ఉదృతి తగ్గగానే ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణ పనులు మొదలు అవుతాయి
  • మొదటి ప్రమాద హెచ్చరిక వరకు ఇంకా వరద రాలేదు. కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పని చేయాలి
  • విద్యుత్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఏవైనా ప్రమాదం కలిగించే విధంగా ఉంటే వెంటనే మార్చాలి
  • చెరువులు, కుంటలు, వాగులు ఎక్కడైనా తెగిపోయే విధంగా ఉంటే వెంటనే వాటి మరమ్మత్తులు చేయాలి
  • రామప్ప నుంచి పాకాల వరకు వేరే చెరువులు నింపుకునే అవకాశం ఉంటే వాటిని పనులు చేపట్టండి. ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి
  • రామప్ప కు ప్రపంచ స్థాయి గుర్తింపునకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి
  • ప్రమాదాలు జరిగే చోట హెచ్చరికల బోర్డులు పెట్టాలి. ప్రమాదాలు నివారించాలి
  • వరుస వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలి
  • మారుమూల ప్రాంతాల్లో ఈ అంటువ్యాధులు రాకుండా సిబ్బంది అందుబాటులో ఉండాలి
  • మారుమూల ప్రాంతం సరైన రవాణా వసతి లేని ఇక్కడ మనం మరింత జాగ్రత్తగా ఒక కుటుంబం వలె పని చేయాలి
  • మీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నాం
  • మేడారంలో శాశ్వతంగా భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా పనులు చేయాల్సి ఉంది
  • సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారానికి గొప్ప పేరు వచ్చింది. మెరుగైన వసతులు వచ్చాయి
  • అమ్మవార్ల జాతర అయిన తర్వాతే కరోనా వచ్చింది. ఈసారి అమ్మవారి జాతర వస్తున్నందున కరోనా రాకుండా చూడాలని కోరుకుంటున్నాను
  • జాతర కోసం గత మూడేళ్లలో ఒకసారి 100 కోట్లు, ఇంకోసారి 125 కోట్లు, గత జాతరకు 75 కోట్లు ఇచ్చారు
  • వరదల నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్  పెట్టీ, ఒక బాద్యుడైన అధికారిని పెట్టీ అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి
  • ముంపు ప్రాంతాలు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెట్టీ జాగ్రత్తలు తీసుకొని నిత్యం పర్యవేక్షణ చేయాలి
  • ఈ విపత్తు నుంచి క్షేమంగా బయట పడేలా సమర్థవంతంగా పని చేయాలని కోరుతున్నాను

More Press Releases