'ఐబీపీఎస్/ఎస్ఎస్ సీ' నియామక పరీక్షలకు ఉచిత శిక్షణ!

'ఐబీపీఎస్/ఎస్ఎస్ సీ' నియామక పరీక్షలకు ఉచిత శిక్షణ!
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు ఐబీపీఎస్/ఎస్ఎస్సీ నియామక పరీక్షలకు శిక్షణ

ఐబీపీఎస్/ఎస్ఎస్ సీ నిర్వహించే పరీక్షలకు సిద్ధమయ్యే  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవసరమయ్యే శిక్షణను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే 45 రోజులు ఉచితంగా ఇచ్చుటకు PETC, హైదరాబాద్ లో ఏర్పాట్లు చేయడమైనది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల డిగ్రీ ఆధారంగ ఎస్టీ-72, ఎస్సీ-15, బీసీ-10, పీహెచ్ సీ-3 చొప్పున 100 మంది అభ్యర్థులకు 03.10.2019 నుండి శిక్షణ ఇవ్వబడును.

శిక్షణ పొందుటకు ఆన్ లైన్ లో http://studycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా కోరబడుచున్నవి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు 09.09.2019 నుండి 23.09.2019. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన శిక్షణకై అభ్యర్థులను ఎంపిక చేయబడును. దరఖాస్తు చేసుకునే తెలంగాణ గ్రామీణ ప్రాంత ఎస్టీ అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంత అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.00 లక్షలు దాటకూడదు. మరిన్ని వివరాలకు 040-27540104 ఫోన్ నంబరును ఉ// 10:30 నుండి సా// 5:00 లోపు ఆన్నిపని దినాలలో సంప్రదించగలరు.

ibps
ssc
examination
coaching center
Hyderabad
Telangana

More Press News