గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Related image

హైదరాబాద్: గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కేసీ తండాలో గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా గవర్నర్ గిరిజన తండాలో వారితో పాటు టీకా తీసుకుంటారు.

గిరిజనులకు వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలని గవర్నర్ గతంలోనే పిలుపునిచ్చారు. ఈ దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు గవర్నర్ గిరిజనులతో కలిసి టీకా తీసుకుంటారు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మొదటి టీకా డోస్ ను ఇంతకు ముందే పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకున్నారు. మారూమూల ప్రాంతాలలో ఉన్న ఆదివాసి గిరిజనులందరికీ కూడా ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నర్ సూచించారు.

More Press Releases