విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ కౌన్సిల్ హాల్ ఆవరణలో మంత్రి బొత్స జన్మదిన వేడుక‌లు

విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ కౌన్సిల్ హాల్ ఆవరణలో మంత్రి బొత్స జన్మదిన వేడుక‌లు
విజయవాడ: పురపాలక శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పుట్టినరోజు సందర్భంగా న‌గ‌ర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ ఆవరణలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన జన్మదినోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయ‌ర్ బెలం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడ‌ర్ వెంకట స‌త్య‌నారాయ‌ణ, పలువురు కార్పొరేట‌ర్లతో కలసి భారీ కేక్ క‌ట్ చేసి మంత్రి బొత్స‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సందర్బంగా ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. న‌గ‌రాభివృద్దికి భారీగా నిధులు కెటాయించినందుకు న‌గ‌ర పాల‌క సంస్థ తరపున మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. అదే విధంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని, ఆయన స‌హాకారంతో భ‌విష్య‌త్‌లో న‌గ‌రాన్ని మ‌రింత అభివృద్ది చేస్తామని తెలిపారు. 
Vijayawada
Botsa Satyanarayana
YSRCP

More Press News