పౌరసరఫరాల శాఖలో ఆన్ లైన్ సేవలు నిలిపివేత.. యథావిధిగా ఆదివారం నుండి రేషన్ పంపిణీ

పౌరసరఫరాల శాఖలో ఆన్ లైన్ సేవలు నిలిపివేత.. యథావిధిగా ఆదివారం నుండి రేషన్ పంపిణీ
హైదరాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర డాటా సెంటర్లో హైఎండ్ యు.పి.ఎస్ ను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆన్ లైన్ సేవలు నిలిపివేశారు. దీనితో పాటు రేషన్ కార్డుదారులకు చౌకధర దుకాణాల ద్వారా నిత్యావసరాల వస్తువుల పంపిణీని కూడా శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకు నిలిపివేయడం జరిగింది. యథావిధిగా ఆదివారం నుండి రేషన్ పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభించండం జరుగుతుందని, సాంకేతిక కారణాలతో జరుగుతున్న అంతరాయానికి రేషన్ లబ్దిదారులు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Hyderabad
Telangana
Ration Shop

More Press News