కాపు నేస్తం దరఖాస్తుకు రెండు రోజుల గడువు పొడిగింపు

కాపు నేస్తం దరఖాస్తుకు రెండు రోజుల గడువు పొడిగింపు
విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమ‌లు చేస్తోంద‌ని, కాపు నేస్తం పథకం దరఖాస్తు గ‌డువును ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు పొడిగించిన్న‌ట్లు న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

కాపు నేస్తం అర్హులైన వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు సమర్పించడాన్ని మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. అన్ని వార్డ్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శులు ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌ని సూచించారు.
J Aruna
Vijayawada

More Press News