నిరాడంబరంగా ఏపీ గవర్నర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక

Related image

  • శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతి
విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక విజయవాడ రాజ్ భవన్ లో బుధవారం జరిగింది. కరోనా నేపథ్యంలో అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులు, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాదికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ దంపతులకు మెమోంటోను బహుకరించారు. అలనాటి వివాహ వేడుక జ్ఞాపకాలను ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు గుర్తు చేసుకున్నారు. వివాహా వార్షికోత్సవ వేడుక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి భారతి రెడ్డి దంపతులు బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

స్వయంగా చరవాణిలో మాట్లాడిన ముఖ్యమంత్రి దంపతులు మరెన్నో వార్షికోత్సవ వేడుకలు ఆనందమయంగా జరపుకోవాలని అభిలషించారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

దిలీప్ కుమార్ మృతికి గవర్నర్ సంతాపం:
బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ గా ప్రసిద్ది చెందిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దిలీప్ కుమార్ విభిన్నమైన నటనతో భారత సినీ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారని, విభిన్న తరాల నటులకు ఆయన ప్రేరణ అని అన్నారు.

దిలీప్ కుమార్ ఐదు దశాబ్దాల తన కెరీర్ లో దేశం గర్వించదగ్గ గొప్ప నటులలో ఒకరిగా నిలిచారన్నారు. దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ తన హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

More Press Releases