కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేయండి.. కేంద్ర సహాయమంత్రి పీఎస్ కు లేఖ ఇచ్చిన ఎంపీ బండ ప్రకాష్

Related image

న్యూ ఢిల్లీ: ఎంపీ డా.బండ ప్రకాష్ ఢిల్లీలోని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పీఎస్ ని కలసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, మరియు పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరుతూ లేఖ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లా రెడ్డి లేఖతో పాటు పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎంపీ డా.బండ ప్రకాష్ వివరాలతో కూడిన లేఖ అందించారు. రాష్ట్రంలోని నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన భీమా చేసిన వ్యక్తులు దాదాపు 18లక్షలు మరియు 70 నుండి 80 లక్షల కుటుంబసభ్యులకు వైద్య సేవలు అందించేందుకు కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఎంతగానో అవసరం అని కోరారు.

62 డిస్పెన్సరీల నవీనీకరణ ప్రతిపాదనలు ఈ పాటికే కేంద్రానికి అందించడం జరిగిందన్నారు. భోనగిరి, మహేశ్వరం, మహబూబ్ నగర్, మేడ్చల్ లో ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగింది. షాద్ నగర్, మహేశ్వరం, రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నం, గుండ్ల పోచంపల్లి, సంగారెడ్డి, కొత్తగూడంలోని పాల్వంచ, సూర్యాపేట, హుజుర్ నగర్, వికారాబాద్, సిరిసిల్లలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు స్థాపించాలని కోరారు. 2019-20 పెండింగ్ లో ఉన్న 104 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

More Press Releases