ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు!
నూతన మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులు నూతన మంత్రులకు అభినందనలు తెలపడంతో పాటు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన మంత్రులకు అభినందనలు తెలిపారు. 





