న్యూ ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు శత జయంతి వేడుకలు

Related image

న్యూ ఢిల్లీ: తెలంగాణ భవన్ లో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె ఎమ్ సాహ్ని, పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ జ్యోతి ప్రజ్వలన చేసి పీవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె ఎమ్ సాహ్ని మాట్లాడుతూ పీవీ గారు తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని, పీవీ గారి సార్వభౌమ ఆలోచనతో దేశ ఆర్థిక, సామాజిక, భద్రత అంశాలు, రైతుల పరిస్థితులు  మెరుగుపడ్డాయి. పార్లమెంట్ సభ్యుడు కే ఆర్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని, సమాజాన్నీ ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని,పీవీ నర్సింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు.పీవీ నరసింహా రావు గారి  ఆలోచన, విధానాలను మరింత బలంగా మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు .

భూ సంస్కరణలలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా నమోదు చేస్తున్న భూ రికార్డులు అమలు చేయడానికి అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు రావడానికి, లక్షలాది ఉద్యోగాలు ఏర్పడడానికి సీఎం కేసీఆర్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చారు.  ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు ఏకీకృత విధానం లో అనుమతులు ఇవ్వడం. ఉత్సవాలు, వేడుకలే కాకుండా పీవీ నరసింహా రావు ఆలోచనలను అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభత్వం అని అన్నారు. రానున్న తరాలకు పీవీ ఖ్యాతిని చెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరం అన్నారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ పీవీ నర్సింహారావు గొప్ప దార్శనికుడు.పీవీ నర్సింహారావు (100) శత జయంతి వేడుకలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నరసింహా రావు. తెలంగాణలో కూడా పెద్దఎత్తున భూ సంస్కరణలు తేవడం జరిగింది. పీవీ నరసింహా రావుకు దేశంలో సరైన గుర్తింపు లభించలేదు. ప్రపంచ వ్యాప్తంగాపీవీ నరసింహా రావుకు గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు.

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పీవీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్రంలో కాకుండా దేశ అభివృద్ధి కి ఉపయోగపడ్డాయి అని, ప్రపంచీకరణ, ప్రైవేటికరణ, సరళీకరణ, ఆర్ధిక సంస్కరణలు నేటికి పోటీ పరీక్షల తయారీలో ముఖ్యమైన అంశాలు అని అన్నారు. పీవీ గారు బహుళ భాష వ్యక్తిత్వం గలిగిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివిధ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికపుడు ఫాలో ఆప్ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases