అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు!

అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు!
మలేషియాలో జరిగిన తొమ్మిదవ అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ టోర్నమెంట్ లో తెలంగాణ విద్యార్థులు రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వీరికి అన్ని రకాలుగా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. స్వర్ణ పతక విజేతలు వివేక్ హర్షిత్ రెడ్డి, హర్ష, రజత పతక విజేతలు అబ్రహం థామస్, సామ్యేల్ రతన్, కోచ్ కె. సుధాకర్ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
 
malaysia
Telangana
sports

More Press News