10 రోజుల్లో ఇళ్లు శుంకుస్థాపన‌కు సిద్దం కావాలి: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Related image

  • ఇళ్లు లేని నిరుపేద ఎక్కడా ఉండకూడదన్నదే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌ లక్ష్యం
  • హౌసింగ్ అధికారుల‌ స‌మీక్ష స‌మావేశంలో మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు
విజ‌య‌వాడ: రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అందులో భాగంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికి 35 వేల పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని.. వారు సొంతిళ్లు నిర్మించుకునే ప్రక్రియకు వైసీపీ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్రవారం బ్రాహ్మ‌ణ‌వీధి దేవ‌దాయ శాఖ క్యాంపు కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ ఐ.ఎ.ఎస్ మ‌రియు నగ‌ర పాల‌క సంస్థ అధికారులు, హౌసింగ్ అధికారుల‌తో మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

మంత్రి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ ఐ.ఎ.ఎస్ (JC) నియమించార‌న్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పునాదులు వేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 35 వేల‌  కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా, ఆ ఇళ్లపట్టాలు సహా.. ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అందులో భాగంగా మొద‌టి ద‌శ‌లో 11వేల మందికి ఇళ్లు నిర్మించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, త‌ర్వ‌లో శుంకుస్థాప‌న‌కు సిద్దం చేయాల‌ని, లేఆవుట్ పూర్తి చేయాల‌ని అధికారుల‌ను అదేశించారు.

ఇళ్లు నిర్మించే ప్రాంతంలో తాగునీరు పైపులైన్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సౌకర్యం, అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని, పార్కులు, విలేజ్‌ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, స్కూళ్లు.. తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

ఇళ్లు మంజూరైన అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చిందని, ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును ఇచ్చామని, దీని ప్రకారం నిర్మాణాలు అవుతున్నాయన్నారు.

అదే విధంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పాత రాజ‌రాజేశ్వ‌రీ పేట‌లో రైల్వే స్థ‌లం, ఆర్ అండ్ బి స్థ‌లం, ఇరిగేష‌న్ స్థ‌లం స‌మ‌స్య ప‌రిష్కారారికి ఆయా శాఖల‌ ఉన్నాతాధికారులు చ‌ర్చించి స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. కోండ ప్రాంతంలో నివ‌సిస్తున్న‌వారికి గ‌తంలో 7 వేల ఇళ్లు క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డం జ‌రిగింద‌ని, ఇప్ప‌డు కూడా అవ‌స‌రం మేర‌కు సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఇళ్లు క్ర‌మ‌బద్దీక‌ర‌ణ కృషి చేస్తామ‌ని మంత్రి తెలిపారు.

స‌మావేశంలో న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు ప‌శ్చిమ ఎమ్మ‌ర్వో మ‌ధ‌విల‌త‌, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) / యు.సి.డి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డా. జె.అరుణ, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఏ రామ‌చంద్ర‌రావు ప్రాజెక్ట్ హౌసింగ్ కృష్ణ‌జిల్లా, శ్రీ‌దేవి ఈఈ హౌసింగ్‌, నిర‌క్ష‌ణ‌రావు డిఈ హౌసింగ్ అధికారి త‌దిత‌రులు ఉన్నారు.

More Press Releases