ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులు: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్

ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులు: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్
ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు. భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేసుకున్నారు.

డాక్టర్ రాధాకృష్ణన్ ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయిడు, పండితుడు, తత్వవేత్త, రచయిత, రాజకీయ నాయకునిగా సేవలు అందించారని, తన జీవితాంతం ఉన్నత నైతిక విలువలకు నిలబడ్డారని ప్రస్తుతించారు. అదే మార్గంలో ఉపాధ్యాయ సమాజం పయనించాలని అకాంక్షించారు. ఉపాధ్యాయిలు దేశ నిర్మాణంలో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారని, వారి సహకారం లేకుండా ఏ సమాజమూ ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని గవర్నర్ తెలిపారు.
Governor
bishwa bhushan
Andhra Pradesh

More Press News