హెయిర్ స్టైల్స్, బ్యుటీషియన్ కోర్సుల యందు శిక్షణ!

తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య హైదరాబాద్ వారి ద్వారా రాష్ట్రములోని వివిధ జిల్లాలలో గల నాయీబ్రాహ్మణ పురుషులు, స్త్రీలకు మాడరన్ హెయిర్ స్టైల్స్, బ్యుటీషియన్ కోర్సుల యందు శిక్షణ ఇచ్చుటకు నాయీబ్రాహ్మణులచే నడుపబడుచున్న బ్యుటీషియన్ అకాడమీల నుండి సీల్డు కవరులో ధరలు కోరడమైనది. శిక్షణ హైదరాబాదులో ఇవ్వవలెను, శిక్షణ కాలపరిమితి (15) దినములు, ఇట్టి శిక్షణ కాలవ్యవధిలో అభ్యర్థులకు శిక్షణకు అవసరమగు సామగ్రి, వసతి, భోజన సౌకర్యములు అకాడమీ వారే కల్పించవలసి ఉండును.

పైన తెలిపిన వివరములు http://tsbcwd.cgg.gov.in  నుండి డౌన్లోడ్ చెసుకొనగలరు.

పూర్తి చేసిన వివరములు సీల్డు కవర్ లో తేది 04.09.2019 నుండి తేది 13.09.2019 సాయంకాలము 4.00 గంటల వరకు స్వీకరించబడును. (1) టెక్నికల్ (2) ఫైనాన్సియల్ వివరములు గల రెండు కవర్లతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య హైదరాబాదు వారి పేరిట చెల్లుబాటు అగునట్లు తీసిన రూ. 2000/- (రూ.రెండువేలు మాత్రమే) డి.డి సమర్పించవలెను. తరువాత వచ్చిన కవర్లు స్వీకరించబడవు.

తేది 18.09..2019 రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు నామినేటెడ్ కమిటీ ఆద్వర్యంలో సీల్డు కవర్లు  తెరువబడును.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :  040 23318552

అడ్రస్: మేనేజింగ్ డైరెక్టర్

తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య

డి.ఎస్.ఎస్. భవనము, (ఛా.ఛా నెహ్రు పార్క్ ఎదురుగా)

మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. పిన్ కోడ్  No. 500028.

 

Hyderabad
Telangana
Beautician courses
Hair Style Training

More Press News