ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు!

Related image

ఎస్ఎంటీ స్టెంట్ మ్యానుఫ్యాక్టర్యింగ్ యూనిట్ పేర్కొన్న ప్రాజెక్టుకు రేపు అనగా సెప్టెంబర్ 1వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటలకు భూమి పూజతో ప్రభుత్వం, టీఎస్ ఐఐసీ సహకారంతో ఎస్ఎంటీ సంస్థ శ్రీకారం చుడుతున్నది.

ప్రాజెక్టు ప్రధానాంశాలు:

తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో.. 250 కోట్ల పెట్టుబడితో 3వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) సంస్థ ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ (గుండె శస్త్రచికిత్సకు సంబంధించిన) ఉత్పత్తి చేసే గ్రీన్ ఫీల్డ్ యూనిట్ కు పటాన్ చెరు మండలం సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పారిశ్రామిక రంగంలో దేశంలోనే ముందంజలో దూసుకుపోతున్నది. ఫార్మా (మందుల తయారీ) రంగంలో ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.

తాజాగా వైద్య పరికరాల తయారీ రంగంలోనూ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్టర్యింగ్ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు కానుండటం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైకురాయిగా నిలిచిపోనుంది. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాల పరిశ్రమల ఏర్పాటుకు, ఆ రంగం వేగవంతమైన అభివృద్ధికి ఊతమివ్వనుంది. రాష్ట్రంలో ఎస్ఎంటీ స్టెంట్ యూనిట్ ఏర్పాటుతో గుండె శస్త్రచికిత్సలో వాడే స్టెంట్ల ధరలు కొంత తగ్గి సామాన్య ప్రజలకు ఊరట కలుగనుంది. అలాగే విదేశాల నుండి ఎక్కువ పన్నులు చెల్లించి స్టెంట్లు దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. మరోవైవు ఈ ప్రాజెక్టు ద్వారా స్టెంట్ తయారీ కోసం సైoట్టిస్టులతో పాటు ఇతరులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయు. 

More Press Releases