నందమూరి హరికృష్ణకు నివాళులు అర్పించిన టీడీపీ నేతలు!

నందమూరి హరికృష్ణకు నివాళులు అర్పించిన టీడీపీ నేతలు!
చైతన్య రథ సారధి, మాజీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యురో సభ్యులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు కాట్రగడ్డ బాబు ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ టీడీపీ కార్యాలయం కేశినేని భవన్ నందు హరికృష్ణ గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్యెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా టీడీపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, నల్లగట్ల స్వామిదాసు, గన్నే ప్రసాద్, గోగుల రమణ, లింగమనేని నాని, కొట్టేటి హనుమంతరావు తదితరులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,  నందమూరి వంశ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.

harikrishna
Telugudesam
Vijayawada
Andhra Pradesh

More Press News