తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
  • గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన విశేష కృషిని స్మరించుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదాం - ఏపీ సీఎం జగన్

  • తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తిగారి జయంతిని మనం తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నామంటే తెలుగు భాషా వికాసానికి ఆయన ఎంతగా కృషి చేశారో అర్థం చేసుకోవచ్చు. తెలుగునాట భాషా విప్లవానికి నాంది పలికిన ఆ మహనీయుని సేవలు చిరస్మరణీయం. తెలుగువారికోసం భాష ప్రాతిపదిక మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఘనత తెలుగుదేశానిదే. అలాగే ఏడాది క్రితం తెదేపా హయాంలో తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటుచేయడం జరిగింది. తెలుగుకు ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావడానికి మనందరం కలిసికట్టుగా కృషిచేద్దాం - టీడీపీ అధినేత చంద్రబాబు

  • తెలుగు భాషకు సరికొత్త వెలుగులు నింపిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారు. తెలుగు నేల ఎప్పటికి మిమ్మల్ని స్మరిస్తూనే ఉంటుంది - జనసేన అధినేత పవన్ కల్యాణ్

Andhra Pradesh
telugu language day
Jagan
Chandrababu

More Press News