పీఆర్సీ ప్రకటనపై హోంమంత్రి హర్షం

పీఆర్సీ ప్రకటనపై హోంమంత్రి హర్షం
హైదరాబాద్: రాష్ర ప్రభుత్వంలో పని చేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించడంపై హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. 30% ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు ,ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచడంపై ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనడానికి ఇదొక ఉదాహరణ అని హోంమంత్రి కొనియాడారు. హోం శాఖ పరిధిలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల తో పాటు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు, హోంగార్డులకు ఈ ప్రయోజనం కల్పించడం ద్వారా వారి కుటుంబాలలో వెలుగులు నింపారని సంతోషం వెలిబుచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరందరికీ సమానమైన ఆర్ధిక ప్రయోజనం కల్పించటం ముఖ్యమంత్రి ఉదారత్వానికి నిదర్శనమని తెలిపారు.
prc
Telangana
Md Mahamood Ali

More Press News