దాది హృదయ మోహిని మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం

దాది హృదయ మోహిని మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం
విజయవాడ, మార్చి 12: ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రహ్మ కుమారి సంస్ధ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగి దాది హృదయ మోహిని గురువారం ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. 1936లో 8 సంవత్సరాల వయసులో బ్రహ్మ కుమారి సంస్ధలో చేరిన దాది హృదయ మోహిని, ఆ సంస్థ సేవలో తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

ఆధ్యాత్మిక భావన, సాధన, ఆత్మ చైతన్యం, ధ్యానంల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ కుమారిల కుటుంబం సానుకూల సందేశం వ్యాప్తికి కృషి చేశారన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం రాజయోగిని దాది హృదయ మోహిని తన జీవితాన్ని అంకితం చేశారని గవర్నర్ హరిచందన్ అన్నారు. బ్రహ్మ కుమారి సంస్థ సభ్యులకు గవర్నర్ హరిచందన్ హృదయపూర్వక సంతాపం తెలిపారు.
Biswabhusan Harichandan
Andhra Pradesh

More Press News