పీవీ సింధు పట్టుదల యువతకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

పీవీ సింధు పట్టుదల యువతకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచిన పీవీ సింధుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్ లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధు గారికి నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. బ్యాడ్మింటన్ విజేతగా నిలిచి దేశమంతా గర్వించేలా చేశారు. ఇప్పటి వరకూ మన దేశానికి దక్కని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ ను మన తెలుగు తేజం సింధు సాధించినందుకు ప్రతి ఒక్కరం గర్వపడాలి. ఈ పోటీల్లో 2017, 2018ల్లో తుది పోరులో నెగ్గుకురాలేకపోయినా పట్టుదలతో మూడోసారి జయకేతనం ఎగురవేసిన సింధు అద్వితీయ పోరాటపటిమ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. జైహింద్' అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

PV Sindhu
Pawan Kalyan
sports

More Press News