జర్నలిస్టుల సంక్షేమ నిధి - ఆర్థిక సహాయం పొందడానికి ఈనెల 18వరకు దరఖాస్తు చేసుకోండి: అల్లం నారాయణ

జర్నలిస్టుల సంక్షేమ నిధి - ఆర్థిక సహాయం పొందడానికి ఈనెల 18వరకు దరఖాస్తు చేసుకోండి: అల్లం నారాయణ
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి ఫిబ్రవరి 18వ తేదీ వరకు అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన  అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా గాని, పోస్ట్ ద్వారా గాని ఈ నెల 18వ తేదీ వరకు పంపించాలన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్‌ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాదుకు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు.
allam narayana
Telangana

More Press News